Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 March 2025, 6:44 pm Posted by : ramakrishna

మాదిగలకు 11శాతం, రెండు మంత్రి పదవులు ఇవ్వాలి

ఇందల్వాయి,బతుకమ్మ : అంబేద్కర్ చౌరస్తా వద్ద శనివారం మండలంలోని వివిధ గ్రామాల నుండి మాదిగ సంఘాల నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.ఇందల్వాయి మండల ఇంచార్జ్ గంధమాల నాగభూషణ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. మాదిగ దండోరా డప్పులతో గర్జించారు. ప్రభుత్వాలు ఎన్ని మారిన మాదిగల పట్ల చిన్నచూపు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో మాదిగలు 33 లక్షలు ఉన్న ఒక మంత్రి పదవి కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం చేశారు.12న అసెంబ్లీలో జరగబోయే సమావేశాలలో మాదిగలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని అన్నారు.పదకొండు శాతం రిజర్వేషన్ కల్పించాలని అలాగే ఏ బి సి నుంచి డి పొందుపరచాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నట్లు తెలిపారు.ఇప్పటివరకు రాష్ట్రంలో పలు ప్రభుత్వాలు మారిన మాదిగలను ముందుకు రానివ్వడం లేదని కిందిస్థాయిలోనే నలిపేస్తున్నారని అన్నారు.మందకృష్ణ మాదిగ మాదిగలకు రావలసిన రిజర్వేషన్ల పట్ల గత 30 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నామని అన్నారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తమ పట్ల న్యాయమైన కోరికను ఆలోచించి తప్పనిసరిగా రెండు మంత్రి పదవులు ఇవ్వాలన్నారు.అనంతరం అంబేద్కర్ చౌరస్తా నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ఇన్చార్జి మాదిగ గంధమాల నాగభూషణం నాగభూషణ్, డిచ్పల్లి మండల ఎమ్మార్పీఎస్ ఇన్చార్జి డప్పు నరసయ్య,మోపల్ ఇన్చార్జి సంఘము కిష్టయ్య,మాజీ జాతీయ నాయకురాలు యమునా,సత్యక్క,నామాల గంగాధర్,పెద్ద సాయిలు,చిన్న సాయిలు,భూమయ్య, బక్కన్న,గంగాధర్,మాదిగ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.