Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 December 2024, 7:49 pm Posted by : ramakrishna

ఫిబ్రవరి 3న మాదిగల మండే గుండెచప్పుడు

కామారెడ్డి జిల్లా పర్యవేక్షకులు మంథని సామ్యెల్ మాదిగ

కామారెడ్డి, బతుకమ్మ : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు మరింత జాప్యం జరగకుండా, వర్గీకరణ అడ్డుకుంటామంటున్న స్వార్దపరుల గుండెలు అదిరిపడేలా మాదిగ డప్పులతో ఫిబ్రవరి 3 న హైదరాబాద్ దద్దరిల్లాలని కామారెడ్డి జిల్లా పర్యవేక్షకులు మంథని సామ్యెల్ మాదిగ  పిలుపునిచ్చారు.  బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నకళలను నిజం చేయడానికి , దళితుల్లో సామాజిక న్యాయం కోసం మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరుగుతున్న ముప్పై ఏండ్ల ఆరాటం, పోరాటం, శ్రమ,త్యాగం, ద్వారా సాధించిన ఫలితమే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అని తెలిపారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దాన్ని అమలు చేయమని ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయకుండా  అడ్డుకుంటామంటున్న స్వార్థపరులు, వారికి కొమ్ము కాసే ప్రభుత్వానికి వేయి గొంతులు లక్ష డప్పులతో మాదిగల మండే గుండెచప్పుడేందో తెలియ చెప్పాల్సిన అవసరం ఆసన్నమైందని గుర్తు చేశారు.  అందుకోసం ఎమ్మార్పీఎస్, అనుబంధ విభాగాల కార్యకర్త నుండి మొదలుకొని జిల్లా , రాష్ట్ర, స్థాయికి ఎదిగిన నాయకుల వరకు ప్రతీ ఒక్కరూ ఫిబ్రవరి 3 న సంకకు డప్పు వేసుకుని  హైదరాబాద్ కు రావాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమం లో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు కంతీ పద్మారావు మాదిగ,  ఎంఆర్పీఎస్ సీరియర్ నాయకులు శివానంద బట్టు వేంకట్ రామ్, మహిళ  అధ్యక్షురాలు సత్తిగారి లక్ష్మీ మాదిగ, ఎంఎస్ఎప్ జిల్లా అధ్యక్షులు మెక్కా సాయి మాదిగ, నాగిరెడ్డి పెట్ అధ్యక్షులు తొంట సాయిలు రవి, ఎవనూ రాజు, బాణాపురం  లావణ్య, రామారెడ్డి, బుజ్జమ్మ, రాజా, లక్ష్మి, లింగపెట్టు పరువయ్య, రాజు, భవానిపేట్ సంగమేశ్వర్, లంకలపల్లి సాయిలు, లింగంపేట్,ఇతర నాయకులు పాల్గొన్నారు.

Madigala's burning heartbeat on February 3