మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండల్ శెట్ పల్లి గ్రామంలో మాదిగ సాహిత్యం రిజర్వేషన్ పోరాట సమితి 31 ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కుల పెద్దలు జి రాములు చిట్యాల సురేందర్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మిఠాయిలు పంచి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మోర్తాడ్ మండల డిఎస్పి అధ్యక్షులు ఉమేష్ మహారాజు, కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు బి అనంద్, మాజీ ఎంపిటిసి బి శ్రీనివాస్, కాంగ్రెస్ సభ్యులు గురజాల నర్సారెడ్డి, శెట్ పల్లి గ్రామ కుల సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.