బీసీ బందుకు మాదిగ జేఏసీ మద్దతు
మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యా, ఉద్యోగ, రాజకీయ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు తలపెట్టిన బందుకు మాదిగ జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ తెలిపారు. బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్న బీసీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు మోసం చేస్తునే...