Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 October 2025, 6:49 pm Posted by : ramakrishna

బీసీ బందుకు మాదిగ జేఏసీ మద్దతు

  • మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విద్యా, ఉద్యోగ, రాజకీయ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు తలపెట్టిన బందుకు మాదిగ జేఏసీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ తెలిపారు. బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్న బీసీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు మోసం చేస్తునే ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అగ్ర కులాల్లో ఉండే కొంతమంది స్వార్థపరులు కోర్టులో కేసు వేసి నిలిపివేయించారని అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే ఎవ్వరి మద్దతు లేని రాజ్యాంగ విరుద్దమైన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కోర్టులతో సంబంధం లేకుండా ఎలా అయితే అమలు చేశారో న్యాయమైన బీసీల రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే బీసీలతో కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పిల్లి విజయ్ కుమార్, గంగాధర్ గైక్వాడ్, శంకర్, కేశవ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.