Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 July 2025, 10:24 pm Posted by : ramakrishna

మందకృష్ణ మాదిగను కలిసిన మాదిగ ఉద్యోగుల రాష్ట్ర ఉపాధ్యక్షులు నాంపల్లి   

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పద్మశ్రీ అవార్డు గ్రహీత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మాదిగల ఆత్మగౌరవం మందకృష్ణ మాదిగ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాదులో డ్రీమ్ ల్యాండ్ ఫంక్షన్ హాల్ లో మాదిగ ఉద్యోగుల రాష్ట్ర ఉపాధ్యక్షులు నాంపల్లి, సిలుమల సురేష్ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగల చిరకాల కోరిక అయిన ఎస్సీ వర్గీకరణ ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒప్పించి సాధించారని తెలిపారు. ఈ దేశంలో వర్గీకరణ సాధించి, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అమలు చట్టభద్దత కు కృషి చేసిన మందకృష్ణ మాదిగకు యావత్తు మాదిగ జాతి  రుణపడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగులు సందీప్, సోంనాథ్ పాల్గొన్నారు.