Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 June 2025, 8:30 pm Posted by : ramakrishna

కలెక్టర్ ను కలిసిన మాదిగ ఉద్యోగుల సమాఖ్య

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మాదిగ ఉద్యోగుల సమాఖ్య నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో బుధవారం నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రస్తుతం జరుగుతున్న ప్రమోషన్స్, విద్యా రంగంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎంఈఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు నూతి పల్లి మారుతి, జాతీయ నాయకులు తెడ్డు గంగారం, రాష్ట్ర ఉపాధ్యక్షులు రేణిగుంట నాంపల్లి, సిలుమల సురేష్ పూల గుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఇఎఫ్ నాయకులు, సహదేవ్, భూమన్న, సిహెచ్ గంగాధర్ పాల్గొన్నారు.