అమెరికాలో కారు ప్రమాదంలో మధు యాష్కీ గౌడ్ సతీమణి డాక్టర్ సుచి యాష్కీకి గాయాలు

వెబ్ డెస్క్, బతుకమ్మ :   అమెరికాలో కాంగ్రెస్ సీనియర్ నేత, నిజామాబాద్ మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ సతీమణి డాక్టర్ సుచి యాష్కీ కారు ప్రమాదంలో గాయపడ్డారు. బోస్టన్ నుంచి న్యూయార్క్ వైపు ప్రయాణిస్తుండగా వర్షం కారణంగా కారు అదుపుతప్పి పల్టీలు కొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో డాక్టర్ సుచి యాష్కీకి రిబ్స్ విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని కుటుంబ వర్గాలు తెలిపాయి. వివరాల ప్రకారం, డాక్టర్ సుచి యాష్కీ తమ కుమార్తె డాక్టర్...