👉 గేట్ సగం తెరిచి ఉండగానే పరుగులు తీసిన రైళ్లు
👉 మరమ్మతులు చేపట్టిన రైల్వే అధికారులు
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నిజామాబాద్- హైదరాబాద్ రహదారిపై మాధవ నగర్ వద్ద ఉన్న రైల్వే గేట్ మొరాయించింది. శుక్రవారం ఉదయం రైల్ గేట్ వేసి తెరిచే సమయంలో సగం వారికి తెరిచిన తర్వాత మూతపడింది. మాధవ నగర్ రైల్వే గేటు సగం వరకే తెరుచుకొని పూర్తిస్థాయిలో గేటు పడలేదు. రైళ్లు మాత్రం అలాగే వెళ్లిపోవడం గమనార్హం. గేటు కు ఇరువైపులా వాహనదారులను సిబ్బంది నిలిపివేశారు. ప్రస్తుతం గేటు మరమ్మతులు చేస్తున్నారు. మాధవ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు నత్త నడక నడుస్తుండగానే ఈ ఘటనలు చోటు చేసు కొoటు న్నాయి. ఈ నేపథ్యంలో భారీ వాహనాలను దారి మళ్లించడం ఇబ్బందికరంగా మారింది.


