Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 January 2026, 7:14 pm Posted by : ramakrishna

మాదాపూర్ సర్పంచ్ కాంగ్రెస్‌లో చేరిక

. . . కండువా కప్పి ఆహ్వనించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

 

జక్రాన్ పల్లి మండలం మాదాపూర్ గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నగరంలోని గూపన్ పల్లి బైపాస్ రోడ్డులో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సమక్షంలో సర్పంచ్ సుజాత, ప్రశాంత్ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. తాజాగా జరిగిన గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్‌గా గెలుపొందిన సుజాత ప్రశాంత్ తో పాటు వారి వార్డు సభ్యులు కూడా కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నమ్మకాన్ని కలిగించాయని కాంగ్రెస్‌లో చేరడానికి అవే కారణమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు చిన్న రెడ్డి, జిల్లా సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు చిన్న సాయరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Madhapur Sarpanch joins Congress