ఘనంగా మడేలయ్య ఆలయ వార్షికోత్సవం
బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో మాడెల్లయ్య ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా మడేలయ్యా కళ్యాణాన్ని వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల నడుమ ఘనంగా రజక సంఘం ప్రతినిధులు నిర్వహించారు. అనంతరం ఆలయంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు బుచ్చ గారి రవి, దేవయ్య, చిన్న సాయిలు, మద్దూరి చిన్న నరసింహులు లక్ష్మణ్ ప్రసాద్ రజక సంఘం సభ్యులు ఉన్నారు.