భీమవరం పోలీసులపై మద్దికుంట గ్రామస్తుల దాడి
కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా రామారెడ్డి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులపై మద్దికుంట గ్రామస్తులు దాడి చేశారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఓ కేసు విషయంలో మద్దికుంట గ్రామానికి చెందిన యువకుడిని అరెస్టు చేయడానికి ఆంధ్ర పోలీసులు వచ్చారు. యువకుడిని అరెస్టు చేయకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆంధ్ర పోలీసులను మద్దికుంట గ్రామస్తులు ప్రతిఘటించారు. గ్రామస్తులు వెంబడించడంతో స్థానిక రామారెడ్డి పోలీస్ స్టేషన్ ను ఆంధ్ర పోలీసులు ఆశ్రయించారు. రామారెడ్డి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న మద్దికుంట గ్రామస్తులు ఆంధ్ర- తెలంగాణ పోలీసులపై...