Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 August 2025, 4:59 pm Posted by : ramakrishna

చిన్నారిపై పిచ్చికుక్క దాడి

  • చిన్నారికి తీవ్రగాయాలు
  • జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

Mad dog attacks child

నందిపేట్, బతుకమ్మ : నందిపేట మండల కేంద్ర రాజ్ నగర్ దుబ్బ ప్రాంతంలోని వడ్డెర కాలనీలో శనివారం అల్లెపు అక్షర రెండు సంవత్సరాల చిన్నారి తన ఇంటి ముంగిట ఆడుకుంటుండగా పిచ్చికుక్క అకస్మాత్తుగా దాడి చేయడంతో అక్షర కు తీవ్ర గాయాలయ్యాయి. కుక్క దాడి చేస్తుండగా గమనించిన అక్షర అమ్మమ్మ కర్రతో ఎంత తరిమిన వదలకుండా చిన్నారిని కరవడంతో తలకు, చెంప, బుజము ప్రాంతంలో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్ లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. నందిపేట మండల కేంద్రంలో కుక్కల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మహిళలు చిన్నపిల్లలు బయటకు వెళ్లాలంటేనే భయంతో వణుకుతున్నారు. ప్రధాన కూడళ్ళ వద్ద గుంపులు గుంపులుగా సుమారు 50 నుంచి60 కుక్కలు స్వైర విహారం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వెంటనే అధికారులు తగు చర్యలు చేపట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Mad dog attacks child