Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 August 2024, 3:14 pm Posted by : ramakrishna

చేపూర్ లో పిచ్చికుక్కల దాడి

  •  ఏడుగురిపై పిచ్చికుక్కల దాడి
  • ముగ్గురికి నిజామాబాద్ కు రిఫర్ 

బతుకమ్మ,  ఆర్మూర్

ఆర్మూర్ మండలం చేపూరు గ్రామంలో పిచ్చికుక్కలు స్వైరవిహారం  చేశాయి. గ్రామానికి చెందిన ఏడుగురిపై ఆదివారం ఉదయం పిచ్చి కుక్కలు దాడి చేశాయి.

Mad dog attack in Chepur

గ్రామంలో  పిచ్చి కుక్కలు వేల్పుల నరసయ్య, ఇందూరు పోసాని, కళ ,రాజ్య గంగాధర్, నూత్ పల్లి లలిత, బట్టు లాస్య, జలీల్ లను విచక్షణారహితంగా కరవడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి ప్రాథమికి చికిత్స అందించారు. ముగ్గురికి కుక్కకాటుతో  తీవ్ర గాయాలు కాగా  నిజామాబాద్ జనరల్ ఆసుపత్రికి తరలించారు.

Mad dog attack in Chepur