సెలవులో మాక్లూర్ డెప్యూటేషన్ ఎంపీడీఓ

యధాస్థానానికివెళ్లాలని గత నెల 8న ఉత్తర్వులు వెళ్లడం ఇష్టం లేకనే సెలవు ముసుగు...! బతుకమ్మ, నిజామాబాద్: మొన్నటి వరకు మాక్లూర్ లో డిప్యూటేషన్ పై విధులు నిర్వహించిన ఎంపీడీవో సెలవులో వెళ్లిపోయారు. ఇంచార్జి బాధ్యతలను నిజామాబాద్ లేదా ఆర్మూర్ ఎంపీడీవోకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. అంగట్లో అన్నీ ఉన్నా... అల్లుడి నోట్లో శని అన్నట్లుగా రెగ్యులర్ అధికారి ఉన్నప్పటికీ డిప్యూటేషన్ పై మరొకరిని కొనసాగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎంపీడీఓ సెలవుపై వెళ్తే ఇంచార్జి ఇచ్చేందుకు మరో మండలాధికారి కోసం అన్వేషించాల్సివస్తోంది....