Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 7:15 pm Posted by : ramakrishna

ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా ఎం. శ్రీనివాస్

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ ఏరియా ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఎం. శ్రీనివాస్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఆయనకు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు, ఆసుపత్రిలో పరిశుభ్రత, సమయపాలన, రోగులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. వైద్య సిబ్బంది సమన్వయంతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

 

M. Srinivas as Area Hospital Superintendent