గాంధీ చౌక్ లో కామదహనం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హోలీ పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలో కామదహనం జరిగింది. జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ లో ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కామదహనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద వచనాలు పటిస్తూ కాముని దహనం చేశారు. మహిళలు కాముని చుట్టూ నీటితో ప్రదక్షణలు చేశారు. శుక్రవారం హోలీ పండుగను నిర్వహించుకోవాలని నిర్వాహకులు సూచించారు.