Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 March 2025, 7:44 pm Posted by : ramakrishna

గాంధీ చౌక్ లో కామదహనం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హోలీ పండుగను పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలో కామదహనం జరిగింది. జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ లో ఆర్య సమాజ్  ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కామదహనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద వచనాలు పటిస్తూ కాముని దహనం చేశారు. మహిళలు కాముని చుట్టూ నీటితో ప్రదక్షణలు చేశారు. శుక్రవారం హోలీ పండుగను నిర్వహించుకోవాలని నిర్వాహకులు సూచించారు.

Lust in Gandhi Chowk