రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో లక్కీ డ్రాను ఏర్పాటు చేశారు. లక్కీ డ్రాలో గెలిచిన వారికి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద శుక్రవారం బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రాజేశ్వర్ అప్ప, యువరాజ్ అప్ప, ఆలయ కమిటీ సభ్యులు సూర్యకాంత్, రమణ గౌడ్, లక్కీ లాటరీ విజేతలు తదితరులు పాల్గొన్నారు.