విధేయతకు పట్టం
నిజామాబాద్, బతుకమ్మ: పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం అనుకున్నట్లుగానే విధేయతకు పట్టం కట్టింది. రాజకీయ జీవితం ప్రారంభం నుంచి కాంగ్రెస్ జెండా చేతపట్టి నడిచిన మహేశ్ కుమార్ గౌడ్ రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లను చూశారు. ఎన్ ఎస్ యూ ఐ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మహేశ్ కుమార్ గౌడ్ అంచెలంచెలుగా ఎదిగారు. రెండు సార్లు ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన మహేశ్ కుమార్ గౌడ్ ఓటమి పాలైనప్పటికీ ఎక్కడా వెరవలేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన...