Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 September 2024, 8:25 pm Posted by : ramakrishna

ప్రేమ నిరాకరించిందని ప్రేమికుడి ఆత్మహత్య

బతుకమ్మ, నిజామాబాద్ క్రైం : 

ప్రేమించిన యువతి తన ప్రేమను నిరాకరించడంతో  ప్రేమికుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై ఆరీఫ్ తెలిపిన వివరాల  ప్రకారం గౌతమ్ గాంబియే (26) కూలీ యపనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. గత కొన్ని కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. యువతి తన ప్రేమను నిరాకరించిందని మనస్థాపానికి గురై ఖానాపూర్ శివారులో ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడని  ఎస్సై తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకని మృతదేహాన్ని పోస్టుమార్టం  నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ  సభ్యుల ఫిర్యాదు మేరకు  కేసు  నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.