ప్రియురాలి తల్లిపై ప్రేమోన్మాది దాడి

గొంతు నులిమి చంపేందుకు యత్నం   కరీంనగర్, బతుకమ్మ : కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారం అనుబంధ గ్రామమైన సుద్దాలపల్లిలో తమ ప్రేమకు అడొస్తుందనే కారణంగా ప్రియురాలి తల్లి చామంతిపై ప్రేమోన్మాది దాడి చేసి గొంతు పిసికి చంపడానికి ప్రయత్నం చేశాడు. సుద్దాలపల్లి గ్రామానికి చెందిన దూట రాజ్ కమార్, జాడి సుస్మిత అనే యువతితో కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఇది గమనించి కూతురైన సుష్మితను తల్లి చామంతి మందలించింది. పక్షవాతంతో మంచం పట్టిన తండ్రి పరిస్థితి వివరించి కూతురు మనసు మార్చేందుకు...