Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 March 2025, 5:42 pm Posted by : ramakrishna

ప్రియురాలి తల్లిపై ప్రేమోన్మాది దాడి

  • గొంతు నులిమి చంపేందుకు యత్నం

 

కరీంనగర్, బతుకమ్మ : కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారం అనుబంధ గ్రామమైన సుద్దాలపల్లిలో తమ ప్రేమకు అడొస్తుందనే కారణంగా ప్రియురాలి తల్లి చామంతిపై ప్రేమోన్మాది దాడి చేసి గొంతు పిసికి చంపడానికి ప్రయత్నం చేశాడు. సుద్దాలపల్లి గ్రామానికి చెందిన దూట రాజ్ కమార్, జాడి సుస్మిత అనే యువతితో కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఇది గమనించి కూతురైన సుష్మితను తల్లి చామంతి మందలించింది. పక్షవాతంతో మంచం పట్టిన తండ్రి పరిస్థితి వివరించి కూతురు మనసు మార్చేందుకు ప్రయత్నించింది. తమ ప్రేమకు అడ్డు వస్తుందనే నెపంతో ఎలాగైనా తనను చంపాలనే కసితో బహిరంగంగానే చామంతిని రాజకుమార్ తీవ్రంగా కొట్టి గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశాడు. స్థానికులు రాజ కుమార్‌ను  అడ్డుకోవడంతో ప్రాణాపాయం నుంచి బాధితురాలు బయటపడింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. రాజ్ కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Lover's attack on girlfriend's mother