శంకోరా గుట్ట ప్రాంతంలో జోరుగా పేకాట
మందు, విందు ఆట వద్దే పేకాటతో నాశనం అవుతున్న జీవితాలు వర్ని, బతుకమ్మ : పచ్చని కాపురాను పేకాట మూడు ముక్కలు చేస్తోంది. వ్యసనానికి బానిసలైన వారు అన్నీ పోగొట్టుకుని రోడ్డున పడుతున్నారు. వర్ని మండలంలోని శంకోరా గ్రామ శివారులో గల గుట్ట ప్రాంతంలో పేకాట శిబిరాలు జోరుగా కొనసాగుతున్నాయి. పేకాట శిబిరాల నిర్వాహకులకు ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలు అన్నట్లు సాగుతుంది. వాట్సప్ గ్రూపు లు క్రియేట్ చేసి ఆ గ్రూపుల్లో పేకాట ఆడే ప్రదేశం, బెట్టింగ్‌కు పెట్టే సొమ్మును సదరు...