జోరుగా మొరం దందా..
అభివృద్ధి పనుల పేరిట గుట్టలను కొల్లగొడుతున్న వైనం రుద్రూర్, బతుకమ్మ : అక్రమార్కుల తాకిడికి ప్రకృతి సంపద అయిన గుట్టలు కనుమరుగవుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లోనే కాకుండా ఏకంగా మండల కేంద్రం సమీపంలో ఉండే గుట్టలను, కొండలను మొరం తవ్వకాలతో యథేచ్ఛగా తవ్వేస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. వీరి ధన దాహానికి గుట్టలు మాయమై మైదానాలుగా మారుతున్నాయి. రుద్రూర్ మండలంలోని రాయకూర్ శివారులోని గుట్ట ప్రాంతంలో కొందరు అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా అభివృద్ధి పనుల పేరిట మొరం తవ్వకాలు చేపడుతూ టిప్పర్ల ద్వారా...