రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతుగా గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. పట్టపద్రులందరూ అధికార పార్టీ మద్దతు ఉన్న నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మండల పట్టభద్రులకు తెలిపారు. ప్రజా ప్రభుత్వం పట్టభద్రులకు, విద్యార్థిని విద్యార్థులకు ఒక నిబద్ధతతో హామీలన్నీ నెరవేరుస్తున్నందున ప్రజా ప్రభుత్వం పూర్తి మద్దతు ఉన్న నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూరు చంద్రశేఖర్, గ్రామ అధ్యక్షుడు పార్వతి ప్రవీణ్, మండల రైతు సమన్వయ కన్వీనర్ అడప సాయిలు, ఇందూర్ కార్తీక్, కర్క అశోక్, షేక్ నిస్సార్, కాసుల సాయిలు తదితరులు పాల్గొన్నారు.