పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ అందజేత…

  రుద్రూర్ బతుకమ్మ :   రుద్రూర్ గ్రామానికి చెందిన చికెన్ సెంటర్ యజమాని ఏజాస్ తన మొబైల్ ఫోన్ పోగొట్టుకోవడంతో ఆ ఫోన్  బీజేపి పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ కు దొరకడంతో పోలీస్ స్టేషన్ లో ఎస్సైకు అప్పగించారు. శుక్రవారం ఏజాస్ కు ఎస్సై సాయన్న పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను తిరిగి అప్పగించారు. దింతో ఆయన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.