బతుకమ్మ,ఏర్గట్ల: మండలానికి చెందిన ఐదుగురి వ్యక్తుల మొబైల్ ఫోన్లు గతంలో పోగొట్టుకున్నారు. ఈ విషయాన్ని ఐదుగురు వ్యక్తులు ఏర్గట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినారు. వెంటనే ఏర్గట్ల ఎస్సై రాజేశ్వర్ స్పందించి సి,ఈ,ఐ,ఆర్, పోర్టల్ ధ్వార పోయిన 5 మొబైల్స్ ట్రేస్ చేసి ఫిర్యాదిలకు మంగళవారం అందజేశారు. బాధితులు స్థానిక ఎస్సై రాజేశ్వర్ కు కృతజ్ఞతలు తెలిపారు. సి,ఈ,ఐ,ఆర్ ఆపరేటర్ కానిస్టేబుల్ రఘువీర్ గౌడ్ ను ఎస్ఐ రాజేశ్వర్ అభినందించారు.