పోగొట్టుకున్న సెల్ ఫోన్ బాధితునికి అప్పగింత

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ గ్రామానికి చెందిన సయ్యద్ అజర్ ఆటో డ్రైవర్ తన సెల్ ఫోన్ పోగొట్టుకున్నందున స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అట్టి సెల్ ఫోన్ ను ఎస్ఐ సాయన్న గురువారం బాధితునికి అందజేశారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.