బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలో గత నెల రోజుల క్రితం పోగొట్టుకున్న సెల్ ఫోన్ ను బొమ్మల నరసవ్వ కు స్థానిక పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ లింబాద్రి గురువారం లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఏఎస్ఐ మాట్లాడుతూ శుక్రవారం పిట్లం మండల కేంద్రంలో సంత జరుగుతున్న సమయంలో సెల్ఫోన్ దొంగలు ఎక్కువ కావడంతో సెల్ఫోన్ యజమానులు జాగ్రత్తగా ఉంచుకోవాలని ఆయన సూచించారు.