Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 September 2025, 2:44 pm Posted by : ramakrishna

రశీదుల్లేకుండా బియ్యం తరలిస్తున్న లారీ పట్టివేత

 జహీరాబాద్,బతుకమ్మ : జహీరాబాద్ నియోజకవర్గం చిరాగ్ పల్లి పరిధిలోని మాడిగి శివారు ఆర్టీఏ చెక్ పోస్ట్ వద్ద ఎలాంటి రశీదులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న బియ్యం లారీని పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ కె రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, జిజే 37 టి 9543 నంబర్  గల లారీలో సుమారు రూ. 9, 95,840  లక్షల  విలువైన రేషన్ బియ్యాన్ని గుర్తించారు. తక్కువ ధరకు కొని, ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ధరకు అమ్ముతూ అక్రమ వ్యాపారం చేస్తు న్నట్లు గుర్తించారు.  ఈ క్రమంలో చెవ్వ భాస్కర్, రమేష్ ఖజారియ అనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.