Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 August 2025, 8:09 am Posted by : ramakrishna

108 అంబులెన్స్ ను ఢీకొట్టిన లారీ

 

 . . . డి ఎస్ చౌరస్తాలో ఘటన

. . . పేషేంట్ తో పాటు సిబ్బందికి గాయాలు

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిజామాబాద్ నగరం లొ బైపాస్ చౌరస్తా( డిఎస్ చౌరస్తా) వద్ద 108 అంబులెన్స్ ను లారీ ఢీకొట్టింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. మాక్లూర్ మండలం మాణిక్ బండార్  ఏరియాకు చెందిన అంబులేన్స్ మాక్లూర్ మండలం చిక్లీకి చెందిన పెషేంట్ కు అత్యవసర సేవల కోసం నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బైపాస్ రోడ్డు నుంచి వెళ్తున్న రెండు లారీలు స్పీడ్ గా ఒకదానిని ఒకటి ఓవర్ టెక్ చేస్తూ అందులో ఒ లారీ అంబులెన్స్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ లు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనలో  పెషేంట్ తో పాటు అందులో ఉన్న వారి బందువుకు, పైలేట్ ఎన్ రమేష్ స్వల్ప గాయాలు అయ్యాయి. ఇఎంటి టెక్నిషియన్ నాగిని నడుంకు గాయాలు కాగా ఫ్యాక్చర్ అయినట్లు తెలిసింది.  గాయపడ్డ వారిని మరో 108  అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.ఘటన స్థలాన్ని రూరల్ పోలీసులు సందర్శించి కేసు నమోదు చేశారు.