Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 April 2025, 11:02 am Posted by : ramakrishna

మియాపూర్‌ మెట్రోస్టేషన్ వద్ద లారీ బీభత్సం

హోంగార్డు మృతి, ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు

వెబ్ న్యూస్, బతుకమ్మ : మియాపూర్‌ మెట్రో స్టేషన్ వద్ద లారీ బీభత్సం సష్టించింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులపైకి దూసుకెళ్లింది. ఈఘటనలో హోంగార్డు మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. కూకట్ పల్లి నుంచి మియాపూర్ వైపు వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి యూటర్న్ సమీపంలో ట్రాఫిక్ గొడుగును ఢీకొంది. దీంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న రాజవర్ధన్, వికేందర్, సింహాచలం తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సింహాచలం మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.