Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 September 2025, 12:07 pm Posted by : ramakrishna

చిన్నశేష వాహనంపై వేణుమాధవుడిగా శ్రీవారు

తిరుమల, బతుకమ్మ: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రెండో రోజు గురువారం ఉదయం తిరుమలలో చిన్నశేష వాహన సేవ నిర్వహించారు. ఐదు తలల శేష వాహనంపై మలయప్ప స్వామి దర్శనమిచ్చారు. గోవుల కాపరిగా, వేణుమాధవుడిగా భక్తులకు శ్రీనివాసుడు అభయ ప్రదానం చేశారు. ఈసందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది.