Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 September 2025, 2:02 pm Posted by : ramakrishna

హ‌నుమంత వాహ‌నంపై కోదండ రాముని అలంకారంలో శ్రీవారు 

తిరుమల, బతుకమ్మ :  శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆరో రోజు సోమవారం ఉదయం 8 గంటలకు  శ్రీవేంకటేశ్వర స్వామి శ్రీ కోదండ రాముని అవతారంలో ధ‌నుస్సు, బాణం ధ‌రించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు.  హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి దర్శనమిచ్చారు.సాయంత్రం 4 నుంచి 5 గంట‌ల వ‌ర‌కు స్వ‌ర్ణ‌ర‌థంపై, రాత్రి 7 గంటలకు గ‌జ‌వాహనంపై స్వామివారు భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.
Lord Rama in the guise of a charioteer, riding on Hanuman's chariot
Lord Rama in the guise of a charioteer, riding on Hanuman's chariot