సింహ వాహనంపై యోగ నరసింహుని అలంకారంలో శ్రీవారు
తిరుమల, బతుకమ్మ : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన శుక్రవారం ఉదయం శ్రీ మలయప్పస్వామి సింహ వాహనంపై యోగనరసింహుడి అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవకోలాహలంగా జరిగింది. సింహ వాహనం – ధైర్యసిద్ధి శ్రీవారు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్ర లేవగానే దర్శించే వస్తువుల్లో ‘సింహదర్శనం’ అతి ముఖ్యమయింది. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. ఈవాహన...