Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 November 2024, 4:10 pm Posted by : ramakrishna

పత్తి మార్కెట్లలో దోపిడిని అరికట్టాలి

మద్దతు ధర,  బోన స్ఇవ్వాలి : సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ 

బతుకమ్మ, మద్నూర్: పత్తి మార్కెట్లలో దోపిడిని అరికట్టాలి, కనీస మద్దతు ధర 10వేల రూపాయలు ప్రతి రైతుకు అందే విధంగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం క్వింటాలు కు రు.575 బోనస్ ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ రాష్ట్ర ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. మార్కెట్ ధర కన్నా మధ్య దళారులు విపరీతంగా లాభాలు అర్జీస్తున్నారన్నారు. స్వామినాథన్ కమిషన్ సీపర్సుల ప్రకారం రైతులు పెట్టిన పెట్టుబడికి 50% కలిపి కనీస మద్దతు ధరలను నిర్ణయించాలి కానీ కనీసం మద్దతు ధర రూ. 7521 ఉన్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్ ధరలను బట్టి అమ్మకాలు జరపాలనిఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో మంచి ధర కొనసాగుతుందన్నారు. తెలంగాణలో వ్యాపారులు మిలాఖత్ అయి పత్తి ధరలను 6 వేలు 7వేలకు తగ్గించారని నాణ్యత ప్రమాణాలు పేరు చెప్పి రైతులను మోసగించే ప్రయత్నం చేస్తున్నారని ఆయనఆరోపించారు. రాష్ట్రప్రభుత్వం మద్దతు ధరకు బోనస్ కలిపి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని లేకపోతే రైతాంగాని కదిలించి ఆందోళన పోరాటాలు తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు.