విఠల నామస్మరణలతో మారుమోగిన లొంగన్ గ్రామం
. . . బైరాపూర్ విఠలేశ్వర ఆలయానికి భక్తుల పాదయాత్ర జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ మండలంలోని లొంగన్ గ్రామం భక్తి కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఆషాఢమాసం ముగింపు సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే సంప్రదాయంలో భాగంగా ఈసారి కూడా గ్రామానికి చెందిన భక్తులు బైరాపూర్‌లోని ప్రసిద్ధ విఠలేశ్వర ఆలయానికి పాదయాత్రగా బయలుదేరారు. మంగళవారం శంకర్ మహరాజ్, బాలాజీ మహరాజ్, హన్మంత్ మహరాజ్, బల్‌రాం మహరాజ్‌ల ఆధ్వర్యంలో భక్తులు, గ్రామస్తులు పాదయాత్రను ప్రారంభించారు. భాజా భజంత్రీలు, భజన కీర్తనల...