Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 May 2025, 3:10 pm Posted by : ramakrishna

ఆయిల్ ఫామ్ సాగు ద్వారా దీర్ఘకాలిక ఆదాయం

  • విశ్వవిద్యాలయానికి  సలహా కమిటీ సభ్యులు కోటపాటి నరసింహం నాయుడు

 

జక్రాన్ పల్లి, బతుకమ్మ : ఆయిల్ ఫామ్ సాగు ద్వారా దీర్ఘకాలిక ఆదాయం వస్తుందని విశ్వవిద్యాలయానికి  సలహా కమిటీ సభ్యులు కోటపాటి నరసింహం నాయుడు అన్నారు. కలిగోట్ గ్రామంలో కేంద్రంలో జరిగిన రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైతు నాయకుడు ఇటీవల జయశంకర్ వ్యవసాయ  విశ్వవిద్యాలయానికి  సలహా కమిటీ సభ్యునిగా నియమింపబడిన కోటపాటి నరసింహం నాయుడు హాజరయ్యారు.   ఈ సందర్భంగా ఆయన కోటపాటి మాట్లాడుతూ రైతులు పాత పద్ధతులు వీడి తమ తమ భూములను భూసార పరీక్షలు జరిపించుకొని, అధిక దిగుబడి నిచ్చే నూతన వంగడాలను పండించడం, ఆయిల్ ఫామ్ సాగు ద్వారా దీర్ఘకాలిక  ఆదాయం పొందడం, ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల సలహాలు పాటించి, రసాయనిక, పురుగు మందులను తగ్గిస్తూ ఆరోగ్యకరమైన దిగుబడిని సాధించడానికి కృషి చేయాల్సిందిగా రైతులకు వివరించారు. సన్న బియ్యం రకాల వరి పండించడం ద్వారా అటు యం.యస్.పి పొందడం, దానితోపాటు క్వింటాల్ కు 500 బోనస్ పొందడం వల్ల రెండు రకాల లాభాలు గడించవచ్చు అనే విషయాన్ని వివరించారు.  కృష్ణ చైతన్య మాట్లాడుతూ వాడకం  భూసార పరీక్షలు జరిపించుకొని తగిన మోతాదులో మాత్రమే వాడాలని  పై పాటు లో వేసి  డీఏపీ అవసరం లేదని ,  పచ్చి రొట్ట తో రసానిక ఎరువుల అవసరం తగ్గించా వచ్చని వివరించారు.  మండల వ్యవసాయ అధికారి కి దేవకి మాట్లాడుతూ తమ రికమండేషన్ చేసిన వాటిని కొనుగోలు చేసి రసీదులు తప్పనిసరిగా తీసుకొని భద్రపరచు కోవాలని రైతులను కోరారు. పీఏసీఎస్ చైర్మన్ నాగుల శ్రీనివాస్, ఎస్.రుక్మాజి, కొలిప్యాక్  పిఏసిన్  చైర్మన్ నాగుల శ్రీనివాస్,  శాస్త్రవేత్తలు రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం నుండి కృష్ణ చైతన్య సాయి ప్రసాద్, మండలం వ్యవసాయ అధికారి దేవకి పాల్గొన్నారు.