Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 April 2025, 10:32 am Posted by : ramakrishna

డంపింగ్ యార్డు పోగతో స్థానికుల ఉక్కిరి బిక్కిరి

 

. . . ఆసుపత్రి పాలైన కాలనీవాసులు

. . . పరామార్శించిన సిపియం నగర కార్యదర్శి సుజాత

 నిజామాబాద్ సిటి, బతుకమ్మ:

డంపింగ్ యార్డ్ లో అదివారం  రాత్రి 9 గంటకు విపరీతమైన పొగ మంటలు రావడంతో  స్థానిక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.  నగరంలోని 10 వ డివిజన్ లోని 300 క్వార్టర్స్ బీడి వర్కర్స్ కాలనీలో పోగతో ప్రజలు తీవ్ర ఇబ్బంధులు ఎదుర్కున్నారు. సిపిఎం నగర కార్యదర్శి బేజుగం సుజాత అక్కడి ప్రజల వద్దకు వెళ్లి పరిశీలించగా దాదాపు 9 గంటల నుంచి 1 30 గంటల వరకు ప్రజలతోనే ఉండి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు గుర్తించారు. అక్కడ ఉన్న వృద్ధులు చిన్నపిల్లలు శ్వాస ఇబ్బంది సమస్యలతో బాధపడ్డారు అలాగే రాత్రి 1 30  గంటల వరకు ఇంట్లో పడుకోలేక బయట కూర్చోలేక అవస్థలకు గురై దాదాపు పది మంది వరకు గవర్నమెంట్ హాస్పిటల్ లో చేరారు.

Locals are outraged by the dumping yard.

ఈ సందర్భంగా సోమవారం ఉదయం వారిని పరార్శించిన సిపిఎం నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ ఈ నెల లో డంపింగ్ యార్డులో అగ్ని ప్రమాదం జరుగడంతో  6న నిజామబాద్ మున్సిపల్ కమిషనర్ వచ్చి 15 రోజుల్లో ఈ పొగ సమస్య నుంచి మీరు బయట పడే విధంగా మా వంతుగా ప్రయత్నం చేస్తాము మీకు రక్షణ కల్పిస్తారు అని  హమి ఇచ్చారన్నారు. కానీ ఈ ఆదివారం విపరీతమైన మంటలు చెలరేగి పొగ రావడంతో  అక్కడ ప్రజలు ఆస్పత్రి పాలు అవుతున్నా పట్టించుకోలేదన్నారు. కాబట్టి మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించాలి అక్కడ ఉన్న సమస్యను పరిష్కరించాలని  కోరారు.  లేదంటే పెద్ద ఎత్తున మున్సిపల్ ఆఫీస్ ని స్థానికులతో ముట్టడిస్తామని హెచ్చరించారు  ఈ . కార్యక్రమంలో బస్తివాసులు  లావణ్య, కవిత, జ్యోతి, భూలక్ష్మి , సోనీ ,లక్ష్మీ.  మనమ్మ, రూప , లక్ష్మి,  విజయ, గంగాధర్, శ్రీధర్, కళ్యాణ్, సంతోష్, యోగి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

 

Locals are outraged by the dumping yard.