Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 October 2025, 5:27 pm Posted by : ramakrishna

బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించిన తర్వాతనే స్థానిక ఎన్నికలు జరపాలి

  • బిఆర్ఎస్ విద్యార్థి నాయకుడు కంచర్ల రవి గౌడ్

 

సిరిసిల్ల, బతుకమ్మ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బిఆర్ఎస్ విద్యార్థి రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు 42 శాతం కోటా కేటాయిస్తూ విడుదల చేసిన జీ.ఓ 9ను రద్దు చేసే కుట్రలు జరుగుతున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.హైకోర్టు స్టే కారణంగా ప్రభుత్వం బాధ్యతను బిఆర్ఎస్‌పై నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.బీసీల ఓటు బ్యాంకుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు బలహీన వర్గాల గొంతు కోస్తోందని రవి గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు.జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలు ఇద్దరూ బీసీలను మోసం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బీసీల రిజర్వేషన్‌పై పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చిన పార్టీ బిఆర్ఎస్ మాత్రమేనని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధి చూపి 42 శాతం రిజర్వేషన్‌ పై నిర్ణయం తీసుకోవాలని, ఆ తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. “బీసీల నోటికాడి ముద్దను లాక్కున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని జాతీయ పార్టీలపై బీసీ బిడ్డలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు” అని వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో నాయకులు మట్టి శ్రీనివాస్, కోడం వెంకటేశం, శివరాం, కాసర్ల శ్రీనివాస్, మొగిలి, పరుశరాములు, సంతోష్ కర్రే గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.