Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 July 2025, 9:36 pm Posted by : ramakrishna

కార్యకర్తలను నాయకులను చేసేందుకే స్థానిక ఎన్నికలు

  • బీజేపీ మండల ప్రెసిడెంట్  అరే రవీందర్

 

భీమ్ గల్, బతుకమ్మ : క్షేత్ర స్థాయిలో స్థానిక ఎన్నికలు కార్యకర్తలను నాయకులగా తయారు చేసేందుకే వస్తాయని భీమ్ గల్ మండల బీజేపీ ప్రెసిడెంట్ అరే రవీందర్ అన్నారు. బీజేపీ పార్టీ జిల్లా శాఖ,కానిస్టెన్సీ ఇంచార్జ్ డాక్టర్. మల్లికార్జున్ రెడ్డిల  ఆదేశానుసారం శుక్రవారం మండలంలోని పురానిపేట్ లో నిర్వహించిన మండల పార్టీ కార్యశాల సమావేశానికి మండల కార్యశాల ప్రభావరీ సంతోష్ రెడ్డి, ఎన్నికల కన్వీనర్ యోగేశ్వర నర్సయ్యలు ముఖ్య అతిథులుగా హాజరై స్థానిక సంస్థల ఎన్నికల గురించి మండలపాదాధికారులకు దిశ నిర్దేశం చేస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే విధానాన్ని సూచించారు. ఈ సందర్బంగా రవీందర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు పార్టీ కోసం, నాయకుల కోసం కార్యకర్తలు శ్రమ పడ్డారని, ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికల్లో నాయకులు కష్టపడి తమ కార్యకర్తలను నాయకులగా తయారు చేసుకుంటామని అన్నారు. భీమ్ గల్ మండలంలో బీజేపీ పార్టీకి మంచి పట్టు ఉందని, ఈ తరుణంలో ప్రతి కార్యకర్త తనకే టికెట్ వచ్చినట్లుగా పని చేసి మండలంలో సర్పంచిలను, ఎంపిటీసీలను, జడ్పిటీసీలను, ఎంపీపీలను మెజార్టీ స్థానాల్లో గెలిపించుకొందామని ఆయన పిలుపునిచ్చారు.పార్టీ టిక్కెట్లు అందరి నిర్ణయాలను గౌరవించే ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఎం. పీ ధర్మపూరి అరవింద్ కార్యకర్తలను నాయకులుగా చూసేందుకు తాపత్రయ పడుతున్నారని, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి ఎం. పి కళను నెరవేర్చాలని ఆయన కార్యకర్తలను కోరారు. ఈ స్థానిక ఎన్నికల్లో ఎన్నడు లేని విధంగా మెజార్టీ స్థానాల్లో బీజేపీ విజయందుందుభి మ్రోగిస్తుందని రవీందర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో మండల ప్రధాన కార్యదర్శి బిర్రు రామకృష్ణ,కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు తోట గంగాధర్, సీనియర్ నాయకులు ములీగే మహిపాల్, సంధ్య రాజు,గంగాధర్ గౌడ్,పార్థసారథి,నాగార్జున రెడ్డి, బద్దం సంజయ్ కొడిగెల శ్రీనివాస్, వై శ్రీనివాస్,కొట్టాల అశోక్, గాడి వేణు,పార్వతి శ్రీనివాస్,హరికృష్ణ, మల్లెల రమేష్, సాయి బాబా, టీ.సాయిరెడ్డి,అన్వేష్,దేవేందర్,బిజెవైఎం నాయకులు శెట్టి ప్రేమ్ చంద్,శక్తి కేంద్ర ఇన్చార్జిలు మండల పదాధికారులు పాల్గొన్నారు.

Local elections are held to turn activists into leaders.