29న స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల..?
హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం గ్రామపంచాయతీలు మండలాల పరిధిలో రిజర్వేషన్లు ఖరారు ప్రక్రియ చేపట్టారు. మండలలోని ఎంపీటీసీలు సర్పంచుల రిజర్వేషన్లను ఆర్డిఓలు గ్రామాల్లోని వార్డుల రిజర్వేషన్లను ఎంపీడీవోలు పూర్తి చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాల మేరకు.. సంబంధిత అధికారులతో కలెక్టర్లు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలను రెండు లేదా మూడు దశల్లో నిర్వహించాలని జిల్లాల కలెక్టర్ల నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు అందాయి. ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలంటే పోలీసు, పోలింగ్ సిబ్బంది...