. లెక్చరర్ ఇంట్లో దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు
. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసుల దర్యాప్తు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని ఆటో నగర్ లో ఉన్న లెక్చరర్ మహ్మద్ ఇలియాస్ ఇంట్లో చోరీకి పాల్పడిన దుండగుడిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ధర్మపురి హిల్స్ లోని ట్రిమ్స్ లో లెక్చరర్ గా పని చేస్తున్న ఇలియాస్ శుక్రవారం రాత్రి నైట్ డ్యూటీకి వెళ్లగా అతడి భార్య బంధువుల ఇంటికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దుండగుడు ఇంటి తాళాన్ని పగులగొట్టి బీరువాలోని 17 తులాల బంగారం నగలు, రూ.40వేల నగదు ఎత్తుకెళ్లాడు. దుండగుడి కదలికలను సీసీ ఫుటేజీలో పరిశీలించిన పోలీసులు దుండగుడిని ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. స్థానికంగా బీరువాల తయారీ పని చేసే వ్యక్తే చోరీకి పాల్పడ్డాడని, సదరు వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారని సమాచారం.