డిసెంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు
హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 24లోపు ఎన్నికల షెడ్యూల్ పై నిర్ణయం తెలపాలనిహైకోర్టు గడువు విధించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో డిసెంబర్ లోనే లోకల్ బాడి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలనోత్సవాల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి 9వ తేది వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది....