స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ డిసెంబర్ 11, 14, 17 తేదిల్లో ఎన్నికలు నవంబర్ 27 నుంచే తొలివిడత నామినేషన్ల స్వీకరణ   హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పచ్చజండా ఊపింది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వాహణకు మంగళవారం షెడ్యూల్ విడుదల చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి...