24లోపు స్థానిక సంస్థల ఎన్నికల తేదీ ప్రకటించాలి

కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు   హైదరాబాద్, బతుకమ్మ : ఈనెల 24లోపు స్థానిక సంస్థల ఎన్నికల తేదీని ప్రకటించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రిజర్వేషన్ల మీద మాత్రమే స్టే ఇచ్చామని, ఎన్నికల మీద కాదని హైకోర్టు మండిపడింది. ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. దీంతో రెండు వారాల సమయం ఇస్తూ.. 24వ తేదీలోపు స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.