Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 October 2024, 6:06 pm Posted by : ramakrishna

స్పయిన్ ఆపరేషన్ కు ఎల్ఓసి అందజేత

కమ్మర్ పల్లి, బతుకమ్మ :  కమ్మర్ పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన యేల్ల చిన్నుభాయ్ కి స్పయిన్ ఆపరేషన్ కోసం కానిస్టేన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఎల్ ఓ సీ ఇప్పించారు. తీవ్రమైన వెన్నుపూస నొప్పితో బాధపడుతూ చికిత్స కొరకు హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చేరగా ఆమె కు వైద్య పరీక్షలు నిర్వహించిన ఆపరేషన్ అవసరమని వైద్యులు చెప్పారు. దాంతో చికిత్సకు ఆర్థికపర సహాయం కొరకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ను సంప్రదించగా ఆయన సీ. ఎం రిలీఫ్ ఫండ్ నుండి రూ.2,50,000 రెండు లక్షల యాభై వేల రూపాయల ఎల్ఓసిని అందించడం జరిగింది. ఆపద సమయంలో ఆదుకున్న ముత్యాల సునీల్ కుమార్ కు చిన్నుబాయి కుటుంబ సభ్యులు, బంధువులు కృతజ్ఞతలు తెలిపారు.