బాధిత కుటుంబానికి ఎల్వోసీ అందజేత

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన నగరంలోని అర్సపల్లికి చెందిన నర్సాపురం భూపతికి చికిత్స నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షా 50వేల ఎల్వోసీ(లెటర్ ఆఫ్ క్రెడిట్) మంజూరు చేసింది. బాధితుడి పరిస్థితిని స్థానిక కాంగ్రెస్ నాయకుడు తూటికూర ప్రీతమ్ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డికి వివరించారు. బాధితుడు భూపతికి నిమ్స్ లో హిప్ రిప్లేస్ మెంట్(తుండి ఎముక) చేయాల్సి ఉందని తెలిపారు. వెంటనే మోహన్ రెడ్డి ఎల్వోసీ మంజూరు చేయించగా, బాధిత కుటుంబానికి ప్రీతమ్ శనివారం అందజేశారు.