బాధితునికి ఎల్ఓసి అందజేత
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ గ్రామానికి చెందిన అప్పన్న మోకాల మార్పిడి శాస్రచికిత్స కొరకు ఎల్ఓసికి దరఖాస్తు చేసుకోగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా 80 వేల రూపాయల ఎల్ఓసి మంజూరు కావడంతో మంగళవారం కాంగ్రెస్ నాయకులు బాధితుడు అప్పన్నకు ఎల్ఓసి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మాజీ జడ్పిటీసి నారోజి గంగారం, నాయకులు పత్తి రాము, అక్కపల్లి నాగేందర్, పార్వతి ప్రవీణ్ పాల్గొన్నారు.